పాల్‌ లాబ్‌ ద్వారా ఆదర్శవంతమైన విద్య

May 21,2024 21:58
పాల్‌ లాబ్‌ ద్వారా ఆదర్శవంతమైన విద్య

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంపాల్‌ లాబ్‌ (పెర్సనలైజ్డ్‌ అడాప్టివ్‌ లెర్నింగ్‌) సంప్రదాయ బోధనా విధానాలలో కొనసాగుతున్న అభ్యాస అవాంతరాల ఒత్తిడిని అధిగమించడమే లక్ష్యంగా ఏర్పడ్డాయని రాష్ట్ర సమగ్ర శిక్షా అదనపు పథక సంచాలకులు బి.శ్రీనివాసులు రెడ్డి అన్నారు. స్థానిక గరిమెళ్ళ సత్యనారాయణ అత్యున్నత శిక్షణా అధ్యయన సంస్థ (ట్రైనింగ్‌ కాలేజీ)లో మంగళవారం పాల్‌ ల్యాబ్‌ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎం, గణిత, ఆంగ్ల ఉపాధ్యాయులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ పాల్‌ లాబ్‌ ద్వారా ఆదర్శవంతమైన విద్యావాతావరణం రూపొందించవచ్చన్నారు. విద్యార్థుల విభిన్న అభ్యసన అవసరాలు, అభ్యాస ప్రాధాన్యతలు అభ్యాసస్థాయి శైలి, పురోగతిని అంచనా వేసి వారి విద్యా ప్రయాణంలో సరైన దిశలో ముందుకు సాగేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గత విద్యా సంవత్సరంలో ఏర్పడిన లోటుపాట్లను సవరించుకుని రానున్న విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయిలో పాల్‌ లాబ్‌లను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు రెమిడియల్‌ టీచింగ్‌ ద్వారా సందేహాలు నివృత్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఎడి ఎ.శ్రీనివాస్‌ సింగ్‌, జోన్‌-2 ప్రాంతీయ విద్యా సంచాలకులు బి.నాగమణి, జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు, జిల్లా సమగ్ర శిక్షా అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌ ఎస్‌.సుభాషిణి, రాష్ట్ర పాల్‌ ల్యాబ్‌ కో ఆర్డినేటర్‌ బి.కిషోర్‌, రాష్ట్ర పరిశీలకురాలు నాగమణి, జిల్లా సమగ్ర శిక్షా సెక్టోరియల్‌ అధికారులు, ఎఎంఒ గౌరీ శంకర్‌, సిఎంఒ శ్రీనివాసరావు, ఎఎస్‌ఒ వై.వి.ప్రసాద్‌, రాజమహేంద్రవరం డివిజన్‌ ఉప విద్యాశాఖాధికారి ఇవిబిఎన్‌ నారాయణ, ఐఇ కో ఆర్డినేటర్‌ కనక బాబు, డిఇఒ కార్యాలయ ఎఎస్‌ఒ ప్రసాద్‌, సురేష్‌, సత్తిబాబు, వీరబాబు, నాగిరెడ్డి, సురేష్‌ రాజు, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాకు చెందిన పాల్‌ లాబ్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గణిత, ఆంగ్ల ఉపాధ్యాయులు, రాజమహేంద్రవరం అర్బన్‌, రూరల్‌ సిఆర్‌పిలు పాల్గొన్నారు.

➡️