నేటి నుంచి పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు కౌన్సిలింగ్‌

May 26,2024 23:25
పాలిటెక్నిక్‌

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌
పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నేటి నుంచి కౌన్సిలింగ్‌ జరుగనుంది. బొమ్మూరులోని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ జిఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేశారు. పాలిసెట్‌ కన్వీనర్‌, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ జిఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ వి.నాగేశ్వరరావు ఈ వివరాలను వెల్లడించారు. సోమవారం నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకూ విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. షెడ్యూల్‌లో ప్రకటించిన ప్రకారం ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకూ ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. విద్యార్థులు వారి ర్యాంకుల ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఒసి, బిసి కేటగిరీల వారు రూ.700, ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులు రూ.250 చొప్పున ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి ప్రాసెసింగ్‌ ఫీజుతో పాటూ పాలిసెట్‌ హాల్‌ టిక్కెట్‌, ర్యాంకు కార్డు, పదోతరగతి హాల్‌ టిక్కెట్‌, ర్యాంకు కార్డు, ఒరిజినల్‌ మార్కుల జాబితా లేదా ఇంటర్నెట్‌ కాపీని తీసుకుని రావాలి. నాలుగు నుంచి పదోతరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్‌ లేదా రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌, ఈడబ్ల్యూఎస్‌ వారికి 2021 జనవరి 1 తర్వాత జారీ చేసిన ఆదాయ, కుల ధ్రువీకరణపత్రాలు, టిసి, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు అందుకు సంబంధించి సర్టిఫికెట్లు తీసుకుని రావాలి. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు(ఎన్‌సిసి, ఆంగ్లో ఇండియన్‌, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌, సిఎపి, పిడబ్ల్యూడి, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌), విజయవాడ బెంజి సర్కిల్‌ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఈ నెల 31 నుంచి వచ్చే నెల 3వ తేదీలోగా హాజరు కావాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఈ నెల 31 నుంచి వెబ్‌ ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకూ 1 నుంచి 50వేల రాంకులు పొందిన వారు, జూన్‌ 2, 3 తేదీల్లో 50,001 – 90000 ర్యాంకుల వారు, 4, 5 తేదీల్లో 90001 నుంచి చివరి ర్యాంకు వరకూ విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. ఆప్షన్లు మార్చుకునేందుకు జూన్‌ 5న అవకాశం ఇస్తారు. జూన్‌ 7న కళాశాలల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది. వివరాలకు ష్ట్ర్‌్‌జూర://aజూజూశీశ్రీyషవ్‌.అఱష.ఱఅ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ర్యాంకుల వారీగా షెడ్యూల్‌
మే 27 : 1-12,000మే 28 : 12,001-27,000మే 29 : 27,001-43,000మే 30 : 43,001-59,000మే 31 : 59,001-75,000జూన్‌1 : 75,001- 92,000జూన్‌2 : 92,001-1,08,00జూన్‌3 : 1,08,001- చివరి ర్యాంకువరకూ
విజయవాడ ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల షెడ్యూల్‌ ఇలా
మే 31 : ఎన్‌సిసి 1- 40,000ఆంగ్లో ఇండియన్‌ 1- చివరిర్యాంకు వరకూజూన్‌ 1 : స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ 1-60,000ఎన్‌సిసి 40,001 – 80,000జూన్‌ 2 : స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ 60,001- చివరిర్యాంకు వరకూఎన్‌సిసి 80,001 – చివరి ర్యాంకు వరకూజూన్‌ 3 : సిఎపి, పిడబ్ల్యూడి, 1 – చివరి ర్యాంకు వరకూస్కౌట్‌ అండ్‌ గైడ్స్‌

➡️