14వార్డు డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన

Feb 5,2024 11:51 #East Godavari
drainage works in 14th ward

ప్రజాశక్తి-గోకవరం : మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో 14వ వార్డు మెంబర్ పోసిన శబరి లింగేశ్వరీ ప్రసాద్ ఆధ్వర్యంలో డ్రైనేజీ నిర్మాణా పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ చైర్మన్ గాజింగం సత్తిబాబు, మాజీ జెడ్పిటిసి పాలూరి బోసి బాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర సెక్రెటరీ గునిపే భరత్ చేతుల మీదుగా కొబ్బరికాయలు కొట్టి పని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డ్ మెంబర్ శబరి లింగేశ్వరీ ప్రసాద్ మాట్లాడుతూ సర్పంచ్ కొమరం శ్రావణి గ్రామ పంచాయతీ నిధులు కేటాయించడంతో డ్రైనేజీ పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ గ్రామంలో సిమెంట్ రోడ్లు గాని డ్రైనేజీలు గాని ఎప్పుడో పూర్తి కావాల్సి ఉందని కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దొడ్డిదారిన పంచాయతీ నిధులను కాజేయడం వలన అభివృద్ధికి ఆటంకం కలిగి, ప్రజానీకం నానా అవస్థలు పడ్డారని, రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధులను జగన్మోహన్ రెడ్డి తన సొంత పథకాలకు వాడుకొని గ్రామాభివృద్ధిని కుంటిపడే విధంగా పరిపాలన సాగించాడని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి పులపర్తి బుజ్జి, మండల బీసీ సెల్ అధ్యక్షులు రాయవరపు శీను, బూత్ ఇంచార్జ్ చీకట్ల రాజు,బూత్ ఇంచార్జ్ మేడిశెట్టి వీరబాబు, చోడిశెట్టి గోపీనాథ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

➡️