విజయవాడకు పార్టీ శ్రేణులతో మంత్రి వేణు

Jan 19,2024 13:33 #East Godavari
going to ambedkar statue inaguaration eg

ప్రజాశక్తి-కడియం : విజయవాడలో శుక్రవారం జరుగు డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, సామాజిక సమతా సంకల్ప సభకు కడియం మండలం నుండి అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు. మండల వైసీపీ అధ్యక్షులు వై.స్టాలిన్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. సుమారు 10 ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో వైసీపీ నాయకులు శ్రేణులు అధిక సంఖ్యలో యువకులు బయలుదేరారు. రాష్ట్ర మంత్రి, రాజమహేంద్రవరం రూరల్ వైసీపీ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, స్టాలిన్ మరియు శ్రేణులతో కలిసి బస్సులో ప్రయాణించారు.

➡️