స్ట్రాంగ్‌ రూమ్‌లో జెసి పరిశీలన

May 1,2024 23:31
స్ట్రాంగ్‌ రూమ్‌లో జెసి పరిశీలన

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌బొమ్మూరులోని వసతి గృహ భవనంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమును బుధవారం జెసి తేజ్‌ భరత్‌ పరిశీలించారు. ఇవిఎంలు భద్ర పరిచిన భవనంలో విధుల్లో ఉన్న సిఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. మే 3, 4 తారీఖుల్లో ఇవిఎంల కమీషనింగ్‌ కోసం నియమించిన గ్రామ సర్వేయర్లకు వారి బాధ్యత, పాత్రను వివరించి తగిన సూచనలు అందించారు. రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలో పోలింగ్‌ స్టేషన్ల వారీగా బియు, సియు వివి పాట్స్‌ ఏర్పాటు చేయాల్సిందిగా తెలిపారు. ర్యాండ మైజేషన్‌ ద్వారా అభ్యర్థుల సమక్షంలో నంబర్లను కేటాయించామన్నారు.ఆయన వెంట తహసీల్దార్‌ వైకెవి.అప్పారావు, డిప్యూటీ తహశీల్దార్లు పాల్గొన్నారు.

➡️