పలుచోట్ల జోరుగా అభ్యర్థుల ప్రచారం

Apr 16,2024 22:21
పలుచోట్ల జోరుగా అభ్యర్థుల ప్రచారం

ప్రజాశక్తి-యంత్రాంగం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు మంగళవారం ఆయా నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేశారు. చాగల్లు నేలటూరులో ఇంటింటికీ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో అభ్యర్థి అరుగుల అరుణ్‌ కుమారి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలోని రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని రాహుల్‌ గాంధీ ప్రధాని చేయడం కోసం అందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్‌ వస్తే రైతులకు రుణమాఫీ, ఎల్‌కెజి నుంచి పీజీ వరకూ ఉచిత విద్య ప్రవేశ పెడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్‌ గెడ్డం సాయిబాబా, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొణిదల శ్రీనివాస్‌, బొణిగే రాంబాబు, సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు పాలకుర్తి ప్రభాకర్‌ చౌదరి, జిల్లా కాంగ్రెస్‌ రమణ మూర్తి, హ్యూమన్‌ రైట్స్‌ చైర్మన్‌ పట్నాల శ్రీనివాస్‌, రిటైర్డ్‌ ఎల్‌ఐసి మేనేజర్‌ మట్టా రవి కుమార్‌, మాకా నాగాంజనేయులు, ఎం.సత్యనారాయణ. నల్లి రాజు పాల్గొన్నారు. ఉండ్రాజవరం బిఎస్‌పి నిడదవోలు ఎంఎల్‌ఎ అభ్యర్థి గుమ్మాపు చిత్రసేన్‌ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భాగంగా మండలంలోని మోర్త గ్రామంలో ఆయన మంగళవారం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు ఎటువంటి నిధులు ఇవ్వకపోగా, కేంద్ర ఆర్థిక సంఘం నుండచి వచ్చిన రూ.లక్షలను దారి మళ్ళించి, తన ప్రభుత్వ పతకాలకు వాడుకుందన్నారు. దీని వల్ల గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన జరగలేదన్నారు. గ్రామాల్లో సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేవన్నారు. పంచాయతీలు కరెంటు బిల్లులు కట్టుకొనే స్థితిలో కూడా లేవన్నారు. సిబ్బంది కి జీతాలిచ్చే పరిస్థితి లేదని చిత్రసేను విమర్శించారు.ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకుని పని చేసే అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఆయన వెంట నల్లి రమేష్‌, మర్రి మహాలక్షముడు, కప్పల ఇశ్రాయిల్‌, చిన్నం వెంకటేశ్వర రావు, మోర్త చింతరాజు పాల్గొన్నారు.

➡️