బాధిత కుటుంబాలకు ఎంఎల్‌సి రవీంద్రనాథ్‌ పరామర్శ

Jun 17,2024 23:00
ఎంఎల్‌సి రవీంద్రనాథ్‌

ప్రజాశక్తి – పెరవలి
కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మతిచెందిన ఖండవల్లి గ్రామానికి చెందిన మొల్లేటి సత్యనారాయణ(44), అన్నవరప్పాడు గ్రామానికి చెందిన మీసాల ఈశ్వరరావు(46), అలాగే సౌదీ అరేబియాలో అనారోగ్యంతో మతి చెందిన నల్లాకులవారిపాలెం గ్రామానికి చెందిన చోడబత్తుల విజయరాజు(40) కుటుంబ సభ్యులను ఎంఎల్‌ఎ వంక రవీంద్రనాథ్‌ సోమవారం పరామర్శించారు. ఆయా కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మృతులకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతిని వ్యక్తం చేశారు. మొల్లేటి సత్యనారాయణ కుమారుడు మొల్లేటి శ్రీనివాసరావుకు తమ రవళి స్పిన్నర్స్‌ ఫ్యాక్టరీలో ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. మీసాల ఈశ్వరరావు కుమారుడుకు ఉన్నత చదువులు నిమిత్తం ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. వారికి అవసరమైతే రవళి స్పిన్నర్స్‌ ఫ్యాక్టరీల్లో ఉపాధి అవకాశం కల్పిస్తానని ఆయా కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ నాగరాజు, పంతం చిన్న నల్లాకుల వెంకటేశ్వరరావు ఉప సర్పంచ్‌ అతికాల శ్రీను మండల లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు కోలా సీతయ్య నాయుడు, రెడ్డి సత్యనారాయణ, సానబోయిన హనుమంతు, ఎ.శ్రీను, పి.నాగులు, కె.చినబాబు, కె.వెంకటశ్రీనివాస్‌, సలాది ఉదయభాస్కరరావు తదితరులు పాల్గొన్నారు..

➡️