ప్రభుత్వ పెన్షనర్స్ ధర్నా – తాసిల్దార్ కు వినతిపత్రం

Jan 25,2024 12:34 #East Godavari
pensioners meet mro

ప్రజాశక్తి – చాగల్లు : ప్రభుత్వ  పెంఛనర్స్ చాగల్లు మండల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చాగల్లు మండల ఎపి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో గురువారం అపరిష్కృత సమస్యల పరిష్కారం కొరకు ర్యాలీని తాహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్బహించారు. కరువు భత్యం బకాయిలను వెంటనే విడుదలచేయాలని పిఆర్సీ బకాయిలు చెల్లించాలని 11 పిఆర్సీ మాధిరిగా క్వాంటం పెంఛన్ చెల్లించాని నినాదాలను చేసారు. సంఘం ఉపాధ్యక్షుడు డి నాగేశ్వరరావు, కార్యదర్శి కేవి ఎస్ ఎన్ మూర్తి ఆధ్వర్యంలో డిమాండ్స తో కూడిన వినతి పత్రంను డిప్యూటీ తాహశీల్దార్ నిరంజన్ కి అందజేసారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యవర్గ సభ్యులు కే సత్యవాణి, దాసరి నాగేశ్వరరావు, వెత్సా గంగాధరం, తదితరులు పాల్గొన్నారు.

➡️