పారదర్శకంగా ఇవిఎంల ర్యాండమైజేషన్‌

May 1,2024 23:32
పారదర్శకంగా ఇవిఎంల ర్యాండమైజేషన్‌

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌జిల్లాలో ఎన్నికల పరిశీల కులు, పోటీలో నిలిచిన అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఇవిఎం ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పారద ర్శకంగా చేపట్టినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్‌, రాజమండ్రి రూరల్‌, రాజానగరం నియోజకవర్గాలు, అనపర్తి, రాజమండ్రి సిటీ, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజక వర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థుల సమక్షంలో ఇవిఎంల ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారి డాక్టర్‌ కె.మాధవీలత మాట్లాడారు. రాజమండ్రి పార్లమెంట్‌, రాజమండ్రి రూరల్‌, రాజానగరం అసెంబ్లీ నియోజక వర్గాల ఇవిఎం యూనిట్స్‌ కలెక్టరేట్‌లో ర్యాండమైజేషన్‌ చేశామన్నారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల సమక్షంలో ఎన్ని రౌండ్ల ర్యాండమైజేషన్‌ చెయ్యాలో అడిగి ఆ మేరకు చర్యలు తీసు కున్నట్టు చెప్పారు. జిల్లాలో 1,577 పోలింగ్‌ కేంద్రాలకు చెందిన ఇవిఎఎం యూనిట్స్‌ కేటాయింపులు చేశామన్నారు. తొలుత పార్లమెంట్‌ నియోజకవర్గానికి చెందిన ఇవిఎం యూనిట్స్‌ ర్యాండమైజేషన్‌ అసెంబ్లీ వారీగా ర్యాండమైజేషన్‌ మూడు రౌండ్ల్లఓ చేసి, మూడో రౌండ్‌ను నిర్ధారించామన్నారు. బ్యాలెట్‌ , కంట్రోల్‌ యూనిట్స్‌ 20 శాతం అధికంగా, వివి పాట్స్‌ 30 శాతం అధికంగా కేటాయింపు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకి సంబంధించి సాధారణ ఎన్నికల పరిశీలకులు కె.బాల సుబ్రహ్మణ్యం, కమల్‌ కాంత్‌ సరోఛ్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌, డిఆర్‌ఒ జి.నరసింహులు, ఆర్‌డిఒ ఎ.చైత్ర వర్షిణి పాల్గొన్నారు.

➡️