ఎంఎల్‌ఎ గొట్టిపాటి సమీక్ష

Jan 12,2024 00:08

ప్రజాశక్తి- సంతమాగులూరు
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కార్యకర్తలకు సూచించారు. మండలంలోని పుట్టావారిపాలెం అడ్డ రోడ్డు సమీపంలోని తన అతిథి గృహంలో మక్కెనవారిపాలెం బూత్ ఇన్ చార్జిలు, పేజీ నేస్తం, టిడిపి శ్రేణులతో విడివిడిగా సమావేశమై వివిధ అంశాలపై సమీక్షించారు. 20వ తేదీలోపు భవిష్యత్తుకు గ్యారెంటీ నమోదు పూర్తి చేయాలని అన్నారు. గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలు రోజుకి ఒక వార్డు చొప్పున కలిసి తిరిగి సూపర్ సిక్స్ పథకాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని తెలిపారు. సిఎం జగన్‌రెడ్డి రాష్ట్రంలో నేరస్తుల్ని పెంచి పోషిస్తున్నాడని అన్నారు. జగన్‌రెడ్డి దుర్మార్గపు పాలనకు ముగింపు పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు గాడిపర్తి వెంకటరావు, గొట్టిపాటి చౌదరిబాబు, సిహెచ్ వాసురెడ్డి, తేలప్రోలు రమేష్, కొనికి శ్రీనివాసరావు, ధూపాటి ఏసోబు, మాదాల సుబ్బారావు పాల్గొన్నారు.

➡️