రంగాపురంలో వైసిపి ఎన్నికల ప్రచారం

Mar 22,2024 13:22 #East Godavari

ప్రజాశక్తి-బిక్కవోలు : రంగాపురం గ్రామంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి డాక్టర్ ని అఖండ మెజారటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పోతుల ప్రసాధ్ రెడ్డి (బుజ్జి), ఎస్.వెంకటరమణ, వీరభద్ర రావు, డీవికె రెడ్డి, బుంగా రామారావు, గ్రామ నాయుకులు పాల్గొన్నారు.

➡️