రాజీవ్‌గాంధీ ఆశయ సాధనకు కృషి

అనకాపల్లి కాంగ్రెస్‌ కార్యాలయంలో నివాళులర్పిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-పెందుర్తి

మాజీ ప్రధానమంత్రి, కీర్తిశేషులు రాజీవ్‌గాంధీ ఆశయ సాధన కోసం నేటి యువతీయువకులు కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనకాపల్లి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు విన్నకోట రాము అన్నారు. జివిఎంసి 97వ వార్డు పరిధి చిన్నముసిడివాడ సమీపంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విన్నకోట రాము ఆధ్వర్యాన రాజీవ్‌ గాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా విన్నకోట రాము మాట్లాడుతూ, ప్రజా సంక్షేమానికి నిరంతరమూ కృషిచేసిన ఘనత రాజీవ్‌గాంధీకే దక్కిందని కొనియాడారు. భారతదేశ అభివృద్ధికి రాజీవ్‌గాంధీ ఎన్నో ప్రణాళికలు రూపొందించి అమలు చేశారన్నారు. వాటి ఫలితాలు నేటి యువతీయువకులు, ప్రజలు ఆస్వాదిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఆడారి రమేష్‌నాయుడు, పెందుర్తి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ముక్క రామునాయుడు, నాయకులు ఆర్‌ఆర్‌.నాయుడు, బి.రాంబాబు, టి.విశ్వనాధరావు, కెవి.ప్రసాదరావు, బి.మల్లేశ్వరరావు, ఎమ్‌.వెంకట్రావు, పి.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.అనకాపల్లి : మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ 33వ వర్థంతి కార్యక్రమం అనకాపల్లి రైల్వే స్టేషన్‌ రోడ్డు నాయుళ్ల వీధిలో గల కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి ఎపిసిసి అధికార ప్రతినిధి ఐఆర్‌.గంగాధర్‌ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్‌ గాంధీకే దక్కుతుందని చెప్పారు. కేంద్ర నిధులు నేరుగా పంచాయితీ ఖాతాలకు వచ్చే విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా రాజీవ్‌ గాంధీయేనని చెప్పారు. దేశ భవిష్యత్తు కోసం రాజీవ్‌ గాంధీ ఆశయాలను నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్‌ వాదులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు దాసరి సంతోష్‌, కసింకోట మండల అధ్యక్షుడు సనేడ గజ్జాలు, జిల్లా కార్యదర్శి ఎగ్గాడ భాస్కరరావు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు కొల్లి సత్యరావు, టి.సంతోష్‌, మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు ఏడువాకుల దేవుడమ్మ, జూనియర్‌ న్యాయవాది జయశ్రీ, ఎరుకుల హక్కుల పోరాట కమిటీ అధ్యక్షుడు పూజారి నరసయ్య, ఓరేలా మోహన్‌ కృష్ణ, వెంకటరమణ పాల్గొన్నారు.కశింకోట : కశింకోట ప్రధాన రహదారిలో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ చిత్ర పటానికి కాంగ్రెస్‌ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి రాజీవ్‌ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కత్తెర శ్రీధర్‌, మలపు రెడ్డి కోటేశ్వరరావు, పిఎస్‌ దత్తు, బోయిన భానుమూర్తి యాదవ్‌, తుట్ట రమణ, కాళ్ల సత్యనారాయణ, సేనాపతి రాజు, మాడేపు నాయుడు, బుద్ధ కిషోర్‌ పాల్గొన్నారు.

➡️