సుందరయ్య ఆశయ సాధనకు కృషి

పుచ్చలపల్లి సుందరయ్య

ప్రజాశక్తి-పెందుర్తి : సిపిఎం వ్యవస్థాపక కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సిఐటియు నేతలు పిలుపునిచ్చారు. బుధవారం సుందరయ్య 39వ వర్ధంతి పురస్కరించుకొని స్లీపర్‌ కంపెనీ వద్ద ఆయన చిత్రపటానికి సిఐటియు నేత శంకరరావు పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1913లో నెల్లూరు జిల్లా అలగానిపాడులో జన్మించిన పుచ్చలపల్లి సుందరయ్య, కమ్యూనిస్టు పార్టీలో చేరి స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకెల్లారన్నారు. దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించి, తెలంగాణలో నైజాం నవాబ్‌కు వ్యతిరేకంగా రైతాంగ పోరాటం చేసి పదివేల ఎకరాల భూమిని పేదలకు పంచారన్నారు. ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన సుందరయ్య, చట్టసభలకు సైకిల్‌పై వెళ్లిన నిరాడంబరుడు, నిస్వార్థపరుడని కొనియాడారు.కార్యక్రమంలో సిఐటియు నాయకులు అప్పలనాయుడు, ఆంజినేయులు పాల్గొన్నారు

సుందరయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సిఐటియు నేతలు

➡️