ఎన్నికల ప్రశాంతం

May 13,2024 20:06 #Kakinada, #poling

ప్రజాశక్తి – ఏలేశ్వరం: ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, రౌతులపూడి శంకవరం మండలాల్లో చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికల ప్రశాంతంగా ముగిసాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 79 గ్రామాల్లో 227 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు ప్రక్రియ కొనసాగగా 6 గంటల తర్వాత కూడా లైన్ లలో ఉన్న వాటర్ లను ఓటు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో పలు పోలింగ్ స్టేషన్లో వాటర్ లు క్యూ లైన్ లలో ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు నియోజకవర్గ వ్యాప్తంగా 67. 68 శాతం ఓట్లు నమోదు అయినట్లు ఎన్నికల అధికారి ఏ శ్రీనివాసరావు తెలిపారు. కొన్ని పోలింగ్ స్టేషన్లో వెలుగు సక్రమంగా లేకపోవడం, ఈవీఎంలలో స్వల్ప మరమ్మత్తులు రావడం తప్ప ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని ఆయన అన్నారు. పలు పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు ఉదయం 6 గంటలకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ కట్టారు.

➡️