టిడిపి నాయకుల ఎన్నికల ప్రచారం

Apr 11,2024 20:39

ప్రజాశక్తి- బొబ్బిలి : మున్సిపాలిటీలోని పాతబొబ్బిలిలో టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన గురువారం ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్ధికి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అభివృద్ధిలో వైసిపి పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామన్నారు. ప్రచారంలో జనసేన నియోజకవర్గ ఇంచార్జి గిరడ అప్పలస్వామి, టిడిపి కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, పాల్గొన్నారు.టిడిపిలో 100 కుటుంబాలు చేరిక జామి : జామి మేజరు పంచాయితీలో వైసిపి నుంచి భారీగా టిడిపిలోకి చేరికలు జరిగాయి. గురువారం స్థానిక వెంకటేశ్వర పంక్షన్‌ హాల్‌లో విశాఖ టిడిపి ఉమ్మడి ఎమ్‌పి అభ్యర్థి శ్రీభరత్‌, ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి సమక్షంలో గ్రామానికి చెందిన సూరెడ్డి వీధి, రెల్లివీధి, దొండపర్తి జంక్షన్‌ వద్ద సుమారుగా 100 కుటుంబాల వరకూ టిడిపి కండువా కప్పుకున్నారు. రెల్లి వీధిలో 30 కుటుంబాలు వరకూ వైసిపిని వీడగా, సూరెడ్డి వీధి, దొండపర్తి జంక్షన్‌కు చెందిన సుమారుగా 70 కుటుంబాలు టిడిపిలో చేరాయి. వీరిలో వార్డు సభ్యులు చొక్కాకుల గౌరీ, సూరెడ్డి ఘాన్సీ, గంగమ్మ, అదివమ్మా, అప్పన్న, శ్రావని, అప్పలనాయుడు, సత్యం, లక్ష్మి ఉన్నారు. కార్యక్రమలో టిడిపి నాయకులు వర్రీ రమణ, అల్లాడ పెద్ద, చలుమూరి మహేష్‌, వేండ్రపు శ్రీను తదితరులు ఉన్నారు.సంక్షేమ పాలన టిడిపితోనే సాధ్యం రామభద్రపురం: సంక్షేమ పాలన టిడిపితోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ అన్నారు. గురువారం మండల పరిధిలో సోంపురం పంచాయతీ మర్రివలస గ్రామంలో టిడిపి మండల అధ్యక్షుడు కరణం విజయ భాస్కరరావు, స్థానిక సర్పంచ్‌ చొక్కాపు అప్పలనాయుడులతో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సైకో జగన్‌ ప్రభుత్వాన్ని ఓడించి గద్దె దించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా కూటమి బలపరుస్తున్న బేబీనాయనకు సైకిల్‌ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపిటిసిలు, పాల్గొన్నారు.దళిత ద్రోహి జగన్‌ పార్టీ కి మద్దతు ఇవ్వం దళిత ద్రోహి జగన్‌ పార్టీకి మద్ద్దతు ఇవ్వమని కొట్టక్కి దళితవాడ ప్రజలు తీర్మానించి గురువారం టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, ,జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మడక తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. సుమారు 30 కుటుంబాలు ఆ గ్రామ పార్టీ నేత ముళ్ళు రాంబాబు, వంగపండు భీము నాయుడుల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్ర మంలో జనసేన నేతలు శ్యామ్‌, రమేష్‌, దళిత వాడ నేతలు కిరణ్‌, జ్ఞాన ప్రకాష్‌, దుర్గారావు, దిలీప్‌ పాల్గొన్నారు.వేపాడ : మండలంలోని వీలుపర్తి గ్రామంలో గురువారం విశాఖ ఎమ్‌పి అభ్యర్థి శ్రీభరత్‌, ఎస్‌కోట ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గొంప కృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థు లుగా పోటి చేస్తున్న కోళ్ల లలితకుమారి, భరత్‌లను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కోట వైస్‌ ఎంపిపి సుధారాణి, వేపాడ టిడిపి మండలం అధ్యక్షుడు గొంప వెంకటరావు, నాయకులు గుమ్మడి భారతి, పి రమణ, సిరికి రమణ, వీలుపర్తి సర్పంచ్‌ సేనాపతి లీల, సేనాపతి అప్పారావు, కోటాను అర్జునరావు, భూషణం, సేనాపతి గణేష్‌.జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️