ఎన్నికల నిబంధనలు పాటించాలి

మాట్లాడుతున్న సిఐ వినోద్‌ బాబు

ప్రజాశక్తి- కశింకోట

ఎన్నికల నిబంధనలను అందరూ పాటించాలని కసింకోట సిఐ వినోద్‌బాబు అన్నారు. మండలంలోని అచ్చర్ల గ్రామంలో గ్రామస్తులతో ఎన్నికలపై అవగాహన సమావేశం శుక్రవారం రాత్రి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టం పరమైన చర్యలు చేపడతామన్నారు. ఎన్నికల్లో ఎటువంటి గొడవలు పడకుండా యువత ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ రమేష్‌ బాబు, సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

➡️