ఎన్నికల బాండ్ల వివరాలు వెంటనే ప్రకటించాలి

Mar 11,2024 23:17

ఎస్‌బిఐ బ్రాంచీల వద్ద సిపిఎం ధర్నాలు
ప్రజాశక్తి – ఏలూరు సిటీ
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల బాండ్ల వివరాలను వెంటనే వెల్లడించాలని కోరుతూ ఎస్‌బిఐ మెయిన్‌ బ్రాంచి వద్ద సిపిఎం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీనియర్‌ నేత బి.సోమయ్య అధ్యక్షత వహించగా ధర్నానుద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డిఎన్‌విడి.ప్రసాద్‌, నగర కార్యదర్శి పి.కిషోర్‌ మాట్లాడారు. బిజెపి నేతల ఒత్తిడికి తలొగ్గే ఎస్‌బిఐ బాండ్ల వివరాలు వెల్లడించడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో నేతలు కె.శ్రీనివాస్‌, పి.ఆదిశేసు, వైఎస్‌.కనకారావు, జె.గోపీ, ఎం.ఇస్సాక్‌, ఏసుబాబు, కోటేశ్వరరావు, ఆర్‌.నరసింహమూర్తి, వివివిఎన్‌.ప్రసాద్‌, బాలరాజు, ఇర్ఫాన్‌ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం టౌన్‌: ఎన్నికల బాండ్ల వివరాలను వెంటనే వెల్లడించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌బిఐ బ్రాంచి వద్ద సిపిఎం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. తొలుత సిపిఎం కార్యాలయం నుంచి బుట్టాయగూడెం రోడ్డులోని బ్యాంకు వరకూ ర్యాలీ నిర్వహించారు. బ్యాంకు వద్ద ఆందోళనకు వంగా గోపీ అధ్యక్షత వహించగా సిపిఎం పట్టణ కన్వీనర్‌ పి.సూర్యారావు, మండల కార్యదర్శి ఎం.జీవరత్నం మాట్లాడారు. కార్యక్రమంలో నేతలు ఎస్‌కె.సుభాషిణి, షేక్‌ మహబూబ్‌ సుభాని, అందుగుల ప్రభాకర్‌రావు, జి.మణి, బి.గంగరాజు, డి.వెంకటేశ్వరరావు, ఎన్‌.భద్రం, కె.సునీల్‌ పాల్గొన్నారు. ముసునూరు: ఎన్నికల బాండ్ల వివరాలు వెంటనే వెల్లడించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన స్థానిక ఎస్‌బిఐ బ్రాంచి వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రాజు మాట్లాడారు. కార్యక్రమంలో కంచర్ల శ్రీనివాసరావు, తలకొండ సీతారాములు, కంచర్ల రంగరావు, కంచర్ల పోతురాజు, కంచర్ల సాంబయ్య, రెడ్డి తిరుపతిరావు, చిలీ, నక్కా నాగరాజు పాల్గొన్నారు. నూజివీడు: స్థానిక ఎస్‌బిఐ మెయిన్‌ బ్రాంచి వద్ద సిపిఎం ఆధ్వర్యాన సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి సిపిఎం నేతలు జి.రాజు, హనుమాన్‌లు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణం ఎన్నికల బాండ్ల వివరాలను ఎస్‌బిఐ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వినతిపత్రం అందజేశారు.

➡️