ఎయిడ్స్‌ బాధితుల పట్ల సహృదయంతో మెలగాలి

ప్రజాశక్తి – మండవల్లి

ఎయిడ్స్‌ రోగుల పట్ల చులకన భావాన్ని వీడి ప్రతి ఒక్కరు వారి పట్ల సహృదయంతో మెలగాలని కానుకొల్లు సర్పంచి నాగదాసి థామస్‌ కోరారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ వారి ఆధ్వర్యంలో చైల్డ్‌ ఫ్రంట్‌ ఇండియా లింక్‌ వర్కర్‌ స్కీం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎయిడ్స్‌ రోగులను గౌరవంగా చూడాలన్నారు. దీంతో మనోదైర్యాన్ని పెంపొందించుకొని జీవిస్తారన్నారు. అనంతరం వ్యాధి పట్ల అవగాహన పెంచే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింక్‌ వర్కర్‌ నాగలక్ష్మి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

➡️