గ్రామాలాభివృద్ధికి చిరునామా వైసిపి

ప్రజాశక్తి – ముదినేపల్లి

గ్రామాలాభివృద్ధికి చిరునామా వైసిపి అని, అన్ని విధాలుగా గ్రామాలను అభివృద్ధి పరుస్తున్న జగనన్నను మరోసారి ఆశీర్వదించాలని ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని వాడవల్లి, ఊటుకూరు, వి.రావిగుంట, వైవాక గ్రామాల్లో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఎంఎల్‌సి జయ మంగళ వెంకటరమణ, ఏలూరు పార్లమెంట్‌ వైసిపి అభ్యర్థి కారుమూరి సునీల్‌ కుమార్‌తో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. వాడవల్లి, రావిగుంట, వైవాక గ్రామాల్లో గడప గడపకూ మన ప్రభుత్వం నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను, ఊటుకూరులో రూ.36 లక్షల నిధులతో జలజీవన్‌ మిషన్‌ ద్వారా నిర్మించిన రక్షిత మంచినీటి పథకం పైపులైనును డిఎన్‌ఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఆర్‌వివి.సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గంటా సంధ్య, జెడ్‌పిటిసి ఈడే వెంకటేశ్వరమ్మ, వైస్‌ ఎంపిపి పాల్గొన్నారు.

➡️