సీజనల్‌ వ్యాధుల నిర్మూలనకు చర్యలు

Jun 28,2024 17:09

అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

ప్రజాశక్తి-అమలాపురం

సీజనల్‌ వ్యాధుల నిర్మూలనకు శాఖల సమన్వయంతో నియంత్రణ ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగావించాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా లైన్‌ డిపా ర్ట్మెంట్‌ అధికారులను ఆదేశించారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్‌ వారి ఛాంబర్‌ నందు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం జూలై 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహణ విధి విధానాలు పట్ల లైన్‌ డిపార్ట్మెంట్‌ అధికారులతో సమన్వ య కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగీ వ్యాధి నిరోధక మాసం రుతుపవనాల ఆగమనం సందర్భంలో ఈ వ్యాధి ప్రభలేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని డెంగీ వ్యాధి నిర్మూలనకు సమన్వయ కమిటీ అధికారులు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డెంగీ నిర్మూలన ప్రజానీకానికి ఉత్తమ రక్షణ అన్నారు. డెంగ్యూ మరియు ఇతర కీటక వ్యాధుల నియం త్రణ చర్యల పై అధికారులతో సమీక్షించి మరింత మెరుగైన నివారణ చర్యల కొరకు అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. నివారణ చర్యలను సింహభాగం గ్రామాల పారిశుధ్యం, దోమల నిర్మూలనకు చర్యలపై దృష్టి పట్టాలని ఆదేశించారు. వీటితో పాటు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాలను సచివాలయ సిబ్బంది సహకారంతో మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. రాపిడ్‌ కిట్ల సహకారంతో వ్యాధుల నిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా చేపట్టి వ్యాధులు ప్రబలడానికి గల మూలాలను అన్వేషించి నివారణ చర్యలు పటిష్టం చేయాలన్నారు. అలాగే వ్యాధులు నియంత్రణకై చికిత్సలు సత్వరమే అందించి ఎక్కడ వ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలను బలోపేతం చేయాలన్నారు. పురపాలక సంఘాలలో యాంటీ లార్వా ఆపరేషన్లు పాగింగ్‌ ఆపరేషన్లు విస్తతంగా చేపట్టి కాలువలు, డ్రెయిన్లలో కీటకాలు వ్యాప్తికి ఆస్కారం లేకుండా మందులు పిచికారి చేయాలని ఆదేశించారు. గ్రామాలు పురపాలక సంఘాలలో పల్లపు ప్రాంతాలలో మురుగునీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టడంతో పాటు అంగన్‌వాడీలు, వసతి గృహాలు ప్రాంగణాలలో వద్ద దోమల వ్యాప్తికి కారణమవుతున్న గడ్డి, మురికికుంటలను ఎంపిడిఒ సహకారంతో ఉపాధి హామీ అనుసంధానం ద్వారా నివారిం చాలని ఆదేశించారు. పెద్ద నీటి గుంటలలో గంభూజియా చేప పిల్లలను మత్స్యశాఖ సహకారంతో వేసి దోమల ఉత్పత్తికి మూలమైన లార్వాలను తినే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతుల వసతి గృహాల్లో ఆర్‌ఒ వాటర్‌ ప్లాంట్లను వినియోగిస్తూ సురక్షిత తాగునీటిని అందించాలన్నార.ు అదేవిధంగా దోమల కాటుకు ఆస్కారం లేకుండా వసతి గృహాల కిటికీలకు దోమల మెష్‌లను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా మరుగుదొడ్లు, స్నానపు గదులు పరిశుభ్రంగా ఉండే టట్లు చర్యలు చేపట్టాలన్నారు. జూలై ఆగస్టు మాసాలలో కోనసీమ జిల్లాలో దోమల వ్యాప్తి మరియు గోదావరి వరదలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నందున దోమల నియంత్రణ చర్యలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కీటక జనిత వ్యాధుల మరియు సీజనల్‌ వ్యాధుల నిర్మూలనకు అవసరమైన మందులను పుష్కలంగా అందు బాటులో ఉంచుకోవాలని ఆయన ఆదేశించారు. రెడ్‌ క్రాస్‌ సంస్థ కూడా తగిన సహకారం అందించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. పురపాలక సంఘాలకు పాగింగ్‌ మిషన్లు సరఫరా చేసేందుకు చర్యలు చేప ట్టామన్నారు. నీటి స్వచ్ఛత పరీ క్షలకు, కెమికల్‌ టెస్టింగ్‌ కు అవసరమైన పరికరాలను పురపాలక సంఘాలకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. డెంగీ జ్వరం అనేది ఒక విస్తతమైన వ్యాధిని ఈడిస్‌ దోమ ద్వారా వ్యాపిస్తుందని. తద్వారా మానవ అంటువ్యాధులు సంక్రమిస్తా యన్నారు.డెంగ్యూ లక్షణాలు అధిక జ్వరం తీవ్రమ్కెన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, వికారం, కండరాలు, కీళ్ల నొప్పులు వాంతులు అవుతాయన్నారు డెంగీ నిరోధక మాసోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు సూచించారు. ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్లు రెగ్యులర్గా తనిఖీలు నిర్వహిస్తూ అంగన్వాడీ కేంద్రాలలోని చిన్నారులు డెంగీ వ్యాధి బారిన పడకుండా పరిశుభ్రత దోమల నివారణ చర్యలు చేపట్టాలని ఆదే శించారు. డెంగీ వ్యాప్తి చెందకుండా ముందస్తు నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమల ఉత్పత్తిని నియంత్రించేందుకు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోకుండా నీటి పైపులైన్ల లీకేజీలను సక్రమంగా పరిశీలించి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మాంసాహార దుకాణాలపై ఫుడ్‌ సేఫ్టీ, పంచాయతీ కార్యదర్శులు తనిఖీలు నిర్వహించి పరిశుభ్రత అంశాలను నిజంగా తనిఖీ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గారావు దొర, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సిహెచ్‌వి.భరత లక్ష్మి, సిపిఒ వెంకటేశ్వర్లు, డిపిఒ డి.రాంబాబు, మున్సిపల్‌ కమిషనర్లు ఐసిడిఎస్‌ పీడీ ఎం.ఝాన్సీ రాణి, డిఇఒ కమల్‌ కుమారి, ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ సుమలత, డిసిహెచ్‌ ఎస్‌.కార్తీక్‌ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌సి సురేష్‌ బాబు, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు పి జ్యోతిలక్ష్మి దేవి తదితరులు పాల్గొన్నారు.

 

➡️