చదువుల తల్లి ‘సావిత్రిబాయి ఫూలే’

ఘనంగా 192వ జయంతి

ప్రజాశక్తి – చింతలపూడి

భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా చైతన్య మూర్తి సావిత్రిబాయి ఫూలే అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావు అన్నారు. చింతలపూడి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద సావిత్రిబాయి ఫూలే 192వ జయంతి వేడుకలు కళాశాలలో ఇంగ్లీషు, ఎన్‌ఎస్‌ఎస్‌ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం డాక్టర్‌ ఎ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సావిత్రిబాయి బహుజన జీవితాలను ఎలా ప్రభావితం చేసిందో, ఎలా ఆదర్శమూర్తిగా నిలబడిందో వివరించారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో స్త్రీ విముక్తికై పోరాడిన ధీశాలి అని కొనియాడారు. అనంతరం కల్చరల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ బి.సరస్వతి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో మౌనిక పాల్గొన్నారు.

➡️