జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మెరుగైన వైద్యం

ప్రజాశక్తి – జీలుగుమిల్లి

జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని ఎంపిపి కోర్స పోసమ్మ తెలిపారు. శుక్రవారం మండలంలోని వంకవారి గూడెం పంచాయతీలోని వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసమే ప్రభుత్వం ఆరోగ్య సురక్ష శిబిరాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సురక్ష క్యాంప్‌కి వచ్చిన వారికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ కెఎమ్‌.మంగతాయారు, సర్పంచి కుంజా పార్వతి, వైద్య సిబ్బంది హేమంత్‌, సుల్తాన, దీప్తి, సిహెచ్‌ఒ.శ్రీనివాసరాజు, పంచాయతీ సెక్రెటరీ ఖాజా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️