నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీ

ప్రజాశక్తి – చాట్రాయి

మండలకేంద్రమైన చాట్రాయిలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది శుక్రవారం పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి దామెర ఉష పాల్గొని విద్యార్థులు ఎదుగుదల లోపానికి, రక్తహీనతకు లోనవ్వకుండా నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్‌ మాత్రలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి ఎ.శ్రీనివాసరెడ్డి, ఆరోగ్య సిబ్బంది రమణ, ఎఎన్‌ఎం, పాఠశాల ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️