‘న్యాయం చేయాలని వృద్ధురాలు ఆవేదన’

ప్రజాశక్తి – బుట్టాయగూడెం

తల్లిదండ్రుల నుంచి తనకు వచ్చిన భూమిని కాజేయాలని తన పెద్దనాన్న కుమారుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని బుట్టాయగూడెం మండలం, సీతారామనగరానికి చెందిన గంధం సుబ్బాయమ్మ(72) అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం మీడియాతో తన ఆవేదనను వెల్లబుచ్చుకుంది. మండలంలోని సీతారామ నగరంలో ఆర్‌ఎస్‌ నెం.58/6లో తమ తల్లిదండ్రులకు ఉన్న ఎకరం 3.68 సెంట్లు భూమి నుంచి తనకు వాటాదనంగా 1975 సంవత్సరంలో సంక్రమించిన ఎకరం భూమికి మల్లబత్తుల వెంకన్న తప్పుడు కాగితాలు సృష్టించి, తనను ఇబ్బందులకు గురి చేస్తూ ఆ భూమిని స్వాధీనపరచుకోవడానికి కుట్రలు పన్నుతున్నాడని ఆమె తన బాధను వ్యక్తపరిచింది. ఆ భూమికి సంబంధించి అన్ని అర్హతలతో కూడిన పత్రాలు తమ వద్ద ఉన్నా.. ఎటువంటి సంబంధం లేని మల్లాబత్తుల వెంకన్న ప్రొటెక్షన్‌ కాగితాలు మంజూరు చేయడం చాలా వేదనకు గురి చేస్తుందని ఆ వృద్ధురాలు వాపోయింది. గత 40 ఏళ్లుగా స్థానిక హక్కు భూ ఆక్రమణలో ఉండుటవలన గవర్నమెంటు(రెవెన్యూ) యంక్వైరీ చేసి తనకు పాస్‌బుక్‌, ఖాతా నెం.164, 1-బి పట్టాదారు అడంగల్‌, పహణి మంజూరు చేశారని ఆమె తెలిపింది. అడ్డదారుల్లో భూమికి ప్రొటెక్షన్‌ తీసుకొచ్చిన ఆ వ్యక్తి సహకరించకుండా తనకు తన భూమిని అప్పగించి న్యాయం చేయాలని ఆ వృద్ధురాలు కోరింది.

➡️