‘పది’ విద్యార్థులకు పెన్నులు అందజేత

ప్రజాశక్తి – భీమడోలు

గుండుగొలను, దాని పరిసర గ్రామాల నుంచి సోమవారం ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గ్రామస్తులు, దాతలు బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ తెలిపారు. ఈ సందర్భంగా స్థానికంగా అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమం ద్వారా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత ఆర్‌టిసి బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని తెలిపారు. పరీక్షల సందర్భంగా అప్డేట్లు, మాదిరి ప్రశ్నా పత్రాలు వారి పరిశీలన కోసం అందజేస్తామన్నారు. ఇదేవిధంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం స్థానిక విఘ్నేశ్వర ఆలయం వద్ద ఉచితంగా పెన్నులు పంపిణీ చేస్తున్నట్లు దాతలు తెలిపారు.విద్యార్థులు మంచి మార్కులు సాధించాలి ముసునూరు: తమ హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులతో విజయం సాధించాలని ముసునూరు బార్సు హాస్టల్‌ వార్డెన్‌ షేక్‌ నజీర్‌ అన్నారు. ఆదివారం మండలకేంద్రమైన ముసునూరు బార్సు హాస్టల్‌లో చదువుతున్న తమ విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్స్‌, పెన్నులు, పెన్సిళ్లు, తదితర పరీక్ష సామాగ్రి అందజేసి, విద్యార్థులకు పరీక్షల్లో ఎలా మంచి మార్కులు రాబట్టాలో తెలియజేశారు.

➡️