పలువురు ప్రముఖుల వాహనాలు తనిఖీ

Mar 28,2024 22:09

ప్రజాశక్తి – కామవరపుకోట
రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోటలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ వద్ద గురువారం పలువురు ప్రముఖుల వాహనాలను తనిఖీలు చేసినట్లు ఎన్నికల అధికారి ఎండి.మొహిద్దిన్‌ తెలిపారు. చెక్‌ పోస్ట్‌ మీదుగా వెళ్తున్న తెనాలి, ఉంగుటూరు ఎంఎల్‌ఎలు కన్నావత్తుల శివకుమార్‌, పుప్పాల వాసుబాబు, వైసిపి ఏలూరు పార్లమెంటు అభ్యర్థి కారుమూరి సునీల్‌కుమార్‌యాదవ్‌, చింతలపూడి ఎంఎల్‌ఎ కంభం విజయరాజు, కామవరపుకోట మాజీ జెడ్‌పిటిసి సభ్యులు ఘంటా సుధీర్‌ బాబు వాహనాల్లో తనిఖీలు నిర్వహించారు. ఉంగుటూరు ఎంఎల్‌ఎ వాహనానికి, వైసిపి చింతలపూడి ఎంఎల్‌ఎ అభ్యర్థి వాహనానికి జెండాలు ఉండటంతో అనుమతి ధ్రువ పత్రాలను పోలీస్‌ కానిస్టేబుల్స్‌ రామకృష్ణ, అశోక్‌, సిఐఎస్‌ఎఫ్‌ జవాన్లతో కలిసి పరిశీలించి వారిని పంపించారు. ఎన్నికల నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని చెప్పారు.సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలిఎస్‌ఇబి ఎఎస్‌పి సూర్యచంద్రరావు జీలుగుమిల్లి : అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని ఎస్‌ఇబి అడిషనల్‌ ఎస్‌పి నక్కా సూర్యచంద్రరావు సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని తాటియాకులగూడెంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది పని తీరు గురించి ఆరా తీశారు. అనంతరం ఇటీవల నమోదైన కేసుల వివరాలను, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల గుండా మద్యం, నాటుసారా, గంజాయి వంటివి అక్రమంగా తరలిపోకుండా ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వీలుగా చీరలు, బహుమతులు వంటివి వాహనాల్లో తరలిపోకుండా చూడాలని ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా సిబ్బంది 24 గంటల పాటు తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఎస్‌ఇబి సిఐ పట్టాభిచౌదరి, ఎస్‌ఇబి ఎస్‌ఐ శేఖర్‌బాబు, ఎలైజర్‌ స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️