‘భూ సమస్యలు పరిష్కరించకుంటే ఐటిడిఎ ముట్టడిస్తాం’

బుట్టాయగూడెం : ఎల్‌టిఆర్‌ 1/70 చట్టం భూ సమస్యను ఇప్పటికైనా ఐటిడిఎ అధికారులు సత్వరమే పరిష్కరించాలని లేని పక్షంలో ఐటిడిఎ ముట్టడి కార్యక్రమం చేపడతామని సిపిఎం మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆరు రోజులుగా జరుగుతున్న దీక్షకు ఐటిడిఎ అధికారులు చలనం లేకుండా వ్యవహరిస్తున్నారని, కనీసం దీక్ష శిబిరానికి వచ్చి సమస్య పరిష్కారం చేసే విధంగా హామీ ఇవ్వాలని, లేని పక్షంలో మండల వ్యాప్తంగా ఉన్న గిరిజనులందరినీ సమీకరించి ఐటిడిఎ వద్ద వంటావార్పు ముట్టడి కార్యక్రమం కూడా చేపడతామని హెచ్చరించారు. సిపిఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటికైనా భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేలా అధికారులు ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మరల గూడెం గ్రామస్తులు దుర్గారావు, వెంకటేశ్వరరావు, పుల్లారావు, శ్రీదేవి పాల్గొన్నారు.

➡️