వాటర్‌ ట్యాంకు పరిశీలన

పోలవరం : పాఠశాల వాటర్‌ ట్యాంకులో జంతు కళేబరం పేరిట వచ్చిన వార్త కథనానికి మంచి స్పందన లభించింది. కొయ్యలగూడెం ఉపవిద్యా శాఖ అధికారి రామన్న దొర ఆదేశాల మేరకు గూటాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెవి.రాఘవన్‌ పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు లక్ష్మీకాంతం వాటర్‌ ట్యాంకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాఘవన్‌ మాట్లాడుతూ ఆ ట్యాంక్‌ని గతంలో సత్యసాయి మంచినీటి కోసం వినియోగించే వారని, పాఠశాలకు ఆర్వో ప్లాంట్‌ వచ్చిన నేపథ్యంలో వాటర్‌ ట్యాంకును వాడడం లేదని, నిరుపయోగంగా ఉన్న ట్యాంకులో పిల్లి పడి చనిపోవడం వల్ల దుర్వాసన వచ్చిందని తెలిపారు.

➡️