విద్యార్థుల్లో మానసిక వికాసానికి ‘క్రీడోత్సవాలు’

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు, తద్వారా శారీరక మానసిక దృఢత్వాన్ని పెంచేందుకు ఇలాంటి క్రీడాత్సవాలు నిర్వహిస్తున్నామని హెచ్‌ఎం మంత్రి సత్యనారాయణ తెలిపారు. స్థానిక బాలాజీ నగర్‌ శ్రీచైతన్య స్కూల్‌లో మంగళవారం క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్‌ వ్యాయామ ఉపాధ్యాయులు పి.శ్రీనివాసరావు శ్రీచైతన్య జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు మార్చ్‌ ఫాస్ట్‌ నిర్వహించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్‌, మెడల్స్‌ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ జోనల్‌ కోఆర్డినేటర్‌ ఎస్‌కె.షమ్మీ బేగం, డీన్‌ సుధాకర్‌, ప్రైమరీ ఇన్‌ఛార్జి స్వాతి నాయుడు, ప్రీ ప్రైమరీ ఇన్‌ఛార్జి జ్యోతి, క్రీడా ఉపాధ్యాయురాలు శ్రీదీప్తి పాల్గొన్నారు.

➡️