సొసైటీ వద్ద డిపాజిట్‌ దారుల ఆందోళన

Jan 4,2024 21:06

టి.నరసాపురం : స్థానిక సహకార సంఘంలో డిపాజిట్‌ చేసుకున్న నగదు చెల్లించడం లేదని డిపాజిట్‌ దారులు కొందరు సొసైటీ వద్ద గురువారం డిపాజిట్‌ బాండ్లు ప్రదర్శిస్తూ ఆందోళన నిర్వహించారు. గ్రామానికి చెందిన అనుమోలు సీతారత్నం, కన్నం శ్రీను, పలివెల రాంబాబు, ఈషావళి మరికొందరు సొసైటీలో నగదు డిపాజిట్‌ చేసుకోగా బాండ్లు ఇచ్చారని, బాండ్లు గడువు దాటినా డబ్బులు చెల్లించడం లేదని ఆందోళన చేపట్టారు. కొద్దిసేపు గేట్లు మూసివేసి నిరసన తెలిపారు. దీనిపై సొసైటీ సిఇఒ కె.రాజశేఖర్‌ స్పందిస్తూ అక్టోబర్‌ నెలాఖరు నుంచి త్రిసభ్య కమిటీ అందుబాటులో లేదని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు.

➡️