రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Mar 14,2024 11:41 #Eluru district

ప్రజాశక్తి-ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి వ్యవసాయ శాఖ కార్యాలయ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.  ఈ ప్రమాదంలో జీలుగుమిల్లి గ్రామానికి చెందిన భరత్ అనే యువకుడు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం.  సంఘటన స్థలానికి చేరుకొన్న ఎస్సై వి.చంద్రశేఖర్ వివరాలు సేకరించారు.

➡️