విద్యార్థుల ప్రతిభపై అవగాహన పెంచుకోవాలి

మండవల్లి: విద్యార్థులు అందిపుచ్చుకునే ధోరణి అలవాటు చేసుకోవాలని, అప్పుడే మంచి భవిష్యత్‌ ఉంటుందని మోటివేషనల్‌ స్పీకర్‌ మేడిశెట్టి కళ్యాణ్‌ స్పష్టం చేశారు. భైరవపట్నం శుభం ఫంక్షన్‌ హాల్లో రాయల్‌ క్లబ్‌ కైకలూరు సుధామ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుధా బత్తుల విజరు కుమార్‌ అధ్యక్షతన విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగాల ప్రణాళికపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు, తల్లిదండ్రులకు బుధవారం అవగాహన కలిగించారు. విద్యార్థులు తమ ప్రతిభపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయల్‌ కప్‌ కైకలూరు సెక్రటరీ రామిశెట్టి విజయకుమార్‌, ట్రెజరర్‌ ఆచంట వెంకటరత్నం పాల్గొన్నారు.

➡️