కొయ్యలగూడెం ఎమ్మార్వో ఆఫీసు వద్ద ధర్నా

Mar 14,2024 13:29 #Eluru district

ప్రజాశక్తి-కొయ్యలగూడెం : రైతు కూలి సంఘం, సిఐటియు, ఎఐటిసి, ఐఎఫ్టియు, సిపిఎం, సిపిఐ, సిపిఎంల్ న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొయ్యలగూడెం తాశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు పి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఢిల్లీ రామ్ లీలా మైదానంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం) పంటల మద్దతు ధర చట్టం, రుణ విమోచన చట్టం మాత్రమే రైతులకు ఉపశమనాన్ని కలిగిస్తాయని కానీ బిజెపి ప్రభుత్వం మొత్తం వ్యవసాయ రంగాన్నే కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు కంకణం కట్టుకుంది కావున రాబోయే ఎన్నికల్లో మోడీ నాయకత్వాన ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని దాని మద్దతు దారులను ఓడించడం ద్వారానే అవసరమైన చట్టాలను సాధించుకోగలం వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని కాపాడుకోగలం అని అన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్ల బోయిన రాంబాబు మాట్లాడుతూ  బిజెపి 2014 ఎన్నికల్లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని స్వామినాథ కమిషనర్ సూచనల ప్రకారం సి2+ 50 మద్దతు ధరలు అమలుపరుస్తామని రైతులను రుణ విముక్తులను చేస్తామని వాగ్దానం చేసింది స్వయానా ప్రధాన మోడీ అనేక బహిరంగ సభలో ప్రకటించారు పంటకు మద్దతు ధర చట్టం ఇచ్చిన హామీని అమలు చేయాలని 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ తెచ్చి కార్పొరేటు సంస్థలకు అప్పగించి కార్మికులను బానిసలుగా చేస్తుందన్నారు. ఫిబ్రవరి 13 నుండి హర్యానాలోని శంభు బోర్డర్ దగ్గర ఆందోళన చేస్తున్న రైతాంగం మీద హర్యానా బిజెపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సాగిస్తుందని పోలీసులు కాల్పుల్లో శుభకరం సింగ్ అనే యు వరైతు మృతి చెందగా మరొక నలుగు రైతులు గుండె ఆగి చనిపోయారన్కారు. ఏఐటియుసి నాయకులు జమ్మి శ్రీను మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతులు పై దాడులు ముల్లకంచెలు నీటిపిరంగులు భాస్వయువులు ప్రయోగించి ద్వారా ఈ దాడిలో అనేక మంది రైతులు చూపు, వినికిడి కూలిపోయారని 200 ట్రాక్టర్లు ధ్వంసం అయ్యాయని ఈ వార్తలు బయటికి తెలియకుండా 171 యూట్యూబ్ ఛానల్ పై ప్రభుత్వం నిషేధించి పైగా రైతు ఉద్యమంపై ప్రభుత్వం అనేక దుష్ప్రచారం సాగిస్తుంది. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాల్సిందే మోడీ గద్దె దించల్సిందే అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా నాయకులు వి సద్గురు కొయ్యలగూడెం మండల రైస్ మిల్ బజార్ జట్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కే సీతారాములు ఎస్ శివకుమార్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తాడిగడప ఆంజనేయరాజు ముసల రెడ్డి మట్టా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️