నూజివీడులో గెలిచేది నేనే : కె.పి.సారధి

May 11,2024 17:19 #saradhi

ప్రజాశక్తి-ఆగిరిపల్లి
సోమవారం జరిగే ఎన్నికల్లో నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను శాసనసభ్యుడిగా గెలుపొందటం ఖాయమని సిట్టింగ్‌ ఎమ్మెల్యే, టిడిపి, జనసేన, బిజెపి మద్దతుగా పోటీచేస్తున్న అభ్యర్థి కె.పి.సారధి అన్నారు. ఆగిరిపల్లి మండలం ఎస్‌ఎ పేట గ్రామానికి చెందిన తన్నీరు రామాంజనేయులు, తమ్మిశెట్టి రామారావు, తమ్మిశెట్టి శ్రీనివాసరావు, తమ్మిశెట్టి రంగారావు, తమ్మిశెట్టి వెంకన్న, తమ్మిశెట్టి నాగేంద్రబాబు, తమ్మిశెట్టి మారేశ్వరరావు, తమ్మిశెట్టి మధు, తమ్మిశెట్టి వసంతరావు, తమశెట్టి శివాజీ, తమ్మిశెట్టి శ్రీనివాసరావు, తమ్మిశెట్టి రంగారావు, పల్లెపు ప్రసాద్‌, పల్లెపు కిరణ్‌, పల్లెపు అప్పారావు, దేవళ్ళ రాజు, దేవళ్ళ వెంకన్న, చల్లా అంజి, చల్లా రంగారావు, చల్లా రాఘవ, వేముల కొండలు, వేముల వెంకట్‌, అచ్చి సత్యనారాయణ, తమ్మిశెట్టి బాబురావు, తమ్మిశెట్టి నాగరాజు, తమ్మిశెట్టి ప్రసాద్‌, తమ్మిశెట్టి గంగాధర్‌ రావు, తమ్మిశెట్టి మోహన్‌ రావు, తమ్మిశెట్టి మధు, తమ్మిశెట్టి మాధవరావు, దేవళ్ళ చంద్రరావులు టిడిపిలో చేరారు. వీరందరికీ టిడిపి జెండాలు కప్పి కె.పి. సారధి ఆహ్వానించారు. అంతకు ముందు నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో కొలుసు పార్థసారథి, ఆయన సతీమణి కొలుసు కమల లక్ష్మి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏలూరు పార్లమెంట్‌ అభ్యర్థి పుట్టా మహేష్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూరాజేంద్రప్రసాద్‌ పాల్గన్నారు. ఈ సందర్భంగా సారథి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సస్య శ్యామలం చేసే పోలవరాన్ని జగన్‌ గోదావరిలో కలిపేశారన్నారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. జులై 1వ తేదీన రూ.7000 పింఛను ఇస్తామని, నెలకు రూ.4000 ఇచ్చేలా పెంచుతామన్నారు. ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తామని, జూలైలో మూడు నెలలవి కలిపి ఇస్తామన్నారు. జగన్‌ బమ్మతో ఉన్న పాసు పుస్తకాల నకళ్ళను తగలబెట్టాలని, కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత తీసుకుంటామన్నారు. ప్రజల ఆస్తిపై జగన్‌ కన్ను పడిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోతురెడ్డిపల్లి గ్రామంలో ఉన్న సమస్యలను పూర్తి చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా పుట్టా మహేష్‌యాదవ్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గన్నారు.

➡️