నవోదయకు జెడ్‌పిహెచ్‌ విద్యార్థి జయదుర్గ

ప్రజాశక్తి – కలిదిండి

మండలంలోని గుర్వాయిపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న పోసిన జయదుర్గ నవోదయ స్కూల్‌లో సీటు సాధించినట్లు ఎంఇఒ పిడుగు ప్రభాకర బాబు తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులు దినసరి కూలీలు. జయదుర్గ సీటు సాధించడం పట్ల తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు బస్వా రావుకు, విద్యార్థి జయ దుర్గకు ఎంఇఒ అభినందనలు తెలిపారు.

➡️