రోగులకు వైద్య సిబ్బంది సూచనలు

ప్రజాశక్తి – చాట్రాయి

చాట్రాయి మండలంలోని చిన్నంపేట గ్రామంలో విష జ్వరాలతో బాధపడుతున్న రోగుల కోసం శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరం పరిశీలనకు నూజివీడు డివిజన్‌ డిప్యూటీ డిఎంహెచ్‌ఒ జాస్తి జగన్మోహన్‌రావు పరిశీలించారు. డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఆరు బృందాలుగా గ్రామంలో ఇంటింటికీ సర్వే నిర్వహించారు. జ్వరాలు తగ్గినా కూడా కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ల వాపు తగ్గకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురికాగా వైద్య సిబ్బంది తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. చిన్నంపేటలో వారం రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చాట్రాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

➡️