ఐక్యత-పోరాటమే సిఐటియు నినాదం

ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నేతలు
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
ఐక్యత- పోరాటం అనే నినాదంతో సిఐటియు పని చేస్తుందని పలువురు నాయకులు అన్నారు. సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయం అల్లూరు సత్యనారాయణ భవనం వద్ద సిఐటియు జెండా సంఘం జిల్లా నాయకులు కె.విజయలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్‌.సుందరయ్య, నగర ప్రధాన కార్యదర్శి వి.సాయిబాబు మాట్లాడుతూ సిఐటియు 1970 మే 30న ఏర్పడిందన్నారు. ఈ 54 ఏళ్ల కాలంలో అనేక చారిత్రాత్మకమైన పోరాటాలు నిర్వహించిందన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. అంగన్వాడీ, ఆశ, మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అనేక పోరాటాలు నిర్వహించారన్నారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటం చేసేది సిఐటియు సంఘమే అన్నారు. రానున్న కాలంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు బి.జగన్నాధరావు, మెడికల్‌ రిప్రజెంటివ్స్‌ యూనియన్‌ నాయకులు వివిఎన్‌.ప్రసాద్‌, మొహిద్దిన్‌, శ్రీనివాస్‌, అరుణ కుమారి, జె.గోపీ, ఆర్‌టిసి నాయకులు సురేష్‌ పాల్గొన్నారు.కొయ్యలగూడెం : మండల కేంద్రమైన కొయ్యలగూడెంలో సిఐటియు ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. రైస్‌మిల్లు వద్ద, జంగారెడ్డిగూడెం రోడ్డులో, కొయ్యలగూడెం ప్రాథమిక ఆసుపత్రి దగ్గరలో సిఐటియు కార్యాలయం వద్ద, కొయ్యలగూడెం సెంటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శుక్లబోయిన రాంబాబు మాట్లాడుతూ సిఐటియు ఏర్పడి ఈ రోజుకు 54 ఏళ్లయిందని, ఎన్నో విజయలు సిఐటియు ద్వారా సాధించామని చెప్పారు. 1970లో బెంగాల్‌లోనే కలకత్తా నగరంలో మే 30న సిఐటియు ఆవిర్భవించిందని తెలిపారు. త్యాగం, పోరాటం నినాదంతో 54 ఏళ్లుగా కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటాలు సిఐటియు నిర్వహిస్తుందని చెప్పారు. ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వ సంస్థలను కాపాడాలని సిఐటియు పోరాటం నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశాలు, విఒఎలు, ఆటో, హమాలీ, మిడ్డే మీల్‌, స్కూల్‌ స్వీపర్‌ భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.చింతలపూడి : 54 ఏళ్ల కాలంలో సిఐటియు ఏర్పడిన దగ్గర నుంచి కార్మిక హక్కులకు అనేక పోరాటాలు జరిపి అనేక విజయాలు సాధించిందని సిఐటియు మండలాధ్యక్షులు సిహెచ్‌.శాంతిశ్రీ అన్నారు. మండలంలోని ఫ్యాక్టరీ గేటు వద్ద యూనియన్‌ నాయకులు పి.బాలకృష్ణ సిఐటియు జెండా ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో శాంతిశ్రీ మాట్లాడుతూ కార్మికులకు ఎక్కడ ఆపద జరిగినా సిఐటియు అక్కడ ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకూ పోరాడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ యూనియన్‌ కార్యదర్శి పి.పెద్దిరాజు పాల్గొన్నారు.కనీస వేతనం, కార్మిక హక్కులకై ఉద్యమిద్దాం చింతలపూడి ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లో సిఐటియు మండలాధ్యక్ష కార్యదర్శులు నత్తా వెంకటేశ్వరరావు, బాలరాజు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్‌ నాయకులు సూర్యకుమార్‌, ఆర్‌విఎస్‌.నారాయణ మాట్లాడుతూ ఐక్యత-పోరాటం నినాదంతో 1970, మే 30న ఏర్పడిన సిఐటియు దేశంలో అతిపెద్ద కార్మిక సంఘంగా ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్ట్‌ నాయకులు సరోజిని, మాణిక్యం, సరళ, సెక్టార్‌ లీడర్స్‌ అరుణ, చెన్నకేశ్వరి, ఆశ యూనియన్‌ నాయకులు సరళ, అశ్వని, మెప్మా యూనియన్‌ నుంచి ఝాన్సీ, కృష్ణవేణి, రవాణా రంగం నుంచి మధు, జయరాజు కృష్ణ, యూనియన్‌ సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.ముసునూరు : నూజివీడు పట్టణంలో సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూజివీడు నాయకులు జి.రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దుర్గారావు, కుమార్‌, రాంబాబు, సంసోను, రవి, పాల్గొన్నారు.ఆగిరిపల్లి : కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమించే యూనియన్‌ సిఐటియు అని ఆగిరిపల్లి మండల కార్యదర్శి రాజులపాటి చంటి అన్నారు. ఆగిరిపల్లి సిఐటియు కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో సిఐటియు జెండాను సిపిఎం మండల కార్యదర్శి చాకిరి శివ నాగరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.సుభాకర్‌, ఎస్‌కె.జహాంగీర్‌ బాషా, ఎం.నరేష్‌, ఎస్‌.కోటేశ్వరరావు, జె.రమేష్‌ పాల్గొన్నారు. భీమడోలు : మండలంలోని పలు గ్రామాల్లో సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పూళ్ల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి సిఐటియు నాయకులు అప్పారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతి థిగా పాల్గొన్న సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు సిఐటియు పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బెండి శ్రీనివాస్‌తో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

➡️