కైకరంలో పింఛన్ కోసం పడిగాపులు

Apr 3,2024 13:22 #Eluru district

ప్రజాశక్తి-కైకరం : కైకరం-2 సచివాలయం వద్ద ఫించన్ పెన్షన్ దారులు బుధవారం పడి గాపులు కాచారు. పెన్షన్లు ఉదయం 9 గంటలకు ఇస్తారని అధికారులు చెప్పడంతో ఉంగుటూరు మండలంలో సచివాలయం కార్యాలయం వద్ద పెన్షన్ దారులు పడిగాపులు కాచారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పెన్షన్లు ఇస్తామని అధికారులు తీరుబడిగా చెప్పడంతో పెన్షన్ దారులు నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోయారు. పెన్షన్ కు సంబంధించిన  డబ్బులు ఇంకా రాలేదు. మధ్యాహ్నం రెండు తర్వాత వస్తుందని తెలిసింది.

➡️