ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

విద్యార్థులతో తల్లిదండ్రులను కలిసిన ఉపాధ్యాయులు

ప్రజాశక్తి -బుచ్చయ్యపేట

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన, ఉత్తమైన బోధన ఉంటుందని, పిల్లలను ప్రభుత్వం పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులు ఊరంతా తిరిగి పిల్లల తల్లి దండ్రులకు అవగాహనా కలిపిస్తున్నారు. శుక్రవారం మండలంలోని దిబ్బిడి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాడపల్లి రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయురాలు పోలవరపు కాసులక్ష్మి 2024-25 విద్యా సంవత్సరానికి 1, 2 తరగతుల ప్రవేశాలకు ఇంటి ఇంటికి వెళ్లి పిల్లల వివరాలు సేకరించారు. అంగనవాడి విద్యను పూర్తి చేసుకున్న తర్వాత 1, 2 తరగతులకు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా అన్ని వసతులతో దిబ్బిడి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిల్లలు తల్లి దండ్రులకు సూచించారు.

➡️