నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోండి

ప్రజాశక్తి-గాలివీడు ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని లక్కిరెడ్డిపల్లి సిఐ గంగనాథ్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం కేంద్ర సాయుధ బల గాలతో కలిసి మండలంలోని కొర్లకుంట, తలముడిప,ి నూలివీడు, గాలివీడు ప్రధాన రహదారులలో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లా డు తూ పటిష్ట బందోబస్తు మధ్య ప్రజలను చైతన్యవంతం చేసేందుకే కేంద్ర రాష్ట్ర బలగాలతో కవాతు నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంచ óనీయ సంఘటనలు జరగకుండా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాల్సిన బా ధ్యత తమపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.స్థానిక ఉన్న సమస్యలు ఉంటే తమ దష్టికి తీసుకు రావాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ వెంకటప్రసాద్‌, ఎస్‌ఐ అంజిరెడ్డి, స్థానిక పోలీస్‌ సిబ్బంది, సిఆర్‌ఎఫ్‌ జవాన్లు పాల్గొన్నారు.

➡️