ప్రముఖ వ్యాపారవేత్త కొసరాజు కన్నుమూత

Jun 17,2024 00:28

ప్రజాశక్తి -పొన్నూరు : పొన్నూరు రోటరీ క్లబ్‌ స్థల దాత, ప్రముఖ వ్యాపారవేత్త, రోటరీ క్లబ్‌ మాజీ అధ్యక్షులు కొసరాజు సత్యనారాయణ (82) ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సాయి సేవా సమితి అధ్యక్షునిగా ఆయన వ్యవహరించారు. నిర్మాణంలో ఉన్న రోటరీ క్లబ్‌ నూతన భవనానికి రూ.లక్షల విలువచేసే స్థలాన్ని ఉచితంగా అందజేయడం తోపాటు భవన నిర్మాణానికి సైతం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కొసరాజు సత్యనారాయణ భౌతికకాయాన్ని పొన్నూరు, బాపట్ల ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, వేగేశన నరేంద్రవర్మ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. రైతు కుటుంబంలో జన్మించిన కొసరాజు సత్యనారాయణ 60 ఏళ్లుగా వ్యాపార రంగంలో పేరు ప్రఖ్యాతులు గడించారు. అంతిమయాత్ర సోమవారం ఉదయం 10 గంటలకు జరుగుతుందని ఆయన అల్లుళ్లు శ్రీనివాసరావు, అశోక్‌ కుమార్‌ తెలిపారు. నివాళులర్పించిన వారిలో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ పొన్నూరు అధ్యక్షులు బండారుపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీ బోడపాటి రామారావు, వేదా స్కూల్‌ డైరెక్టర్‌ అంబటి వెంకటేశ్వరావు, జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి బిబి చౌదరి, సభ్యులు ఎన్‌.మేఘనాథ్‌, కె.రామకృష్ణ, తోట భాను, డాక్టర్‌ రవి, రాకేష్‌ దేవ్‌, పాములపాటి రవీంద్రనాథ్‌, ఎంఎం ఖుద్దూస్‌, రెటీనా వీరయ్య, మహమ్మద్‌ జిలాని, ఎన్‌ బాలకృష్ణ, జి.రాధాకృష్ణ, కె.రామచంద్రరావు, జాగర్లమూడి సుధీర్‌, సాయికృష్ణ, ఆరే వరప్రసాద్‌, పి.లక్ష్మీనారాయణ చౌదరి, ఇతర ప్రముఖులున్నారు.

➡️