న్యాయం కోసం పోరాటం చేస్తున్నా

ప్రజాశక్తి-ప్రొద్దుటూరువివేకానందరెడ్డి హత్య జరిగి ఐదేం డ్లవుతున్నా న్యాయం జరగలేదని అందుకే ప్రజాకోర్టులో కొంగుచాచి న్యాయాన్ని అర్థిస్తున్నా మన్నామని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. సోమవారం ప్రొద్దుటూరు పట్టణంలోని పలు కూడళ్లలో ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో షర్మిల మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగ వివేకా నందరెడ్డి రక్తం న్యాయం కోసం ఘోసిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రరాష్ట్ర విడిపోయి పదే ళ్లవుతున్నా కనీసం 10 పరిశ్ర మలైనా రాలేదన్నారు. ఈ పదేళ్లు సగభాగం చంద్రబాబు, మిగిలిన సగభాగం జగన్‌ ముఖ్య మంత్రులుగా రాష్ట్రాన్ని పాలిం చారని పరిశ్రమలు రానందున ఇక్కడి యువత పక్క రాష్ట్రాలకు తమ ఉపాది కోసం వలసపోవల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇదిట్లే కొనసాగితే రాష్ట్రం యువతలేని రాష్ట్రంగా తయారవుతుందని వాపోయారు. పదేళ్ల తరు వాతైనా మనకు మిగిలింది చేతికి చిప్పేనన్నారు. అన్ని తానే చేశానని గొప్పలు చెప్తున్న జగన్‌ ప్రజల చెవిలో పూలు కాదు ఏకంగా క్యాబేజి పెట్టాడని దుయ్యబట్టారు. దివంగత నేత వైఎస్‌ఆర్‌ హయాంలో చౌకదుకాణాల ద్వారా 11 రకాల నిత్యావసర సరుకులు పేదలకు అందేవని జగన్‌ హయాంలో కేవలం ఒక సరుకు మాత్రమే పేదలకు అందుతోందన్నారు. గత ఎన్నికల్లో అమ్మఒడి అందరికీ ఇస్తానని నమ్మబలికిన జగన్‌ తీరా ముఖ్యమంత్రి అయ్యాక ఒకరికే ఇస్తానని వంచించారని మిగిలిన బిడ్డలను జగన్‌కు దత్తతివ్వాలా అని సూటిగా ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలతో సహా ప్రపంచమంతా అభివృద్దిలో దూసుకుపోతోంటే మన రాష్ట్రం కనీసం రాజధాని లేని రాష్ట్రంగా కునారిల్లిపోతుండడం బాధా కరమన్నారు. కడప ఎంపీగా ఉన్న అవినాష్‌ ఏనాడైనా కడప అభివృధ్ది గురించి పార్లమెంట్‌లో మాట్లాడారా అని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌ గురించి అడిగారా, ఎప్పుడు ఢిల్లీకి పోయినా తన కేసులనుంచి బయటపడ్డానికే సమాయాన్ని వెచ్చించారు గాని తనకు అండగా నిలబడిన ప్రజల మేలు గురించి ఒక్కనాడు కూడా ఆలోచించలేదని విమర్శించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బాగా సంపాదించాడట, యధేచ్చగా బెట్టింగ్‌లు, గుట్కా, మట్కా వ్యాపారం, దొంగనోట్ల బిజినెస్‌, మూడు పువ్వులు..ఆరు కాయలుగా దోపిడీలు చేస్తున్నారని విమర్శించారు. దోచుకున్న డబ్బు మొత్తం మీదేనన్నారు. ఎంత ఇచ్చినా తీసుకోండని చెప్పారు. ఆలోచన చేసి ఈ సారి ఓటు వేయండని తెలిపారు. దోచుకునే వారు ఎవరు? పని చేసే వారు ఎవరు? ఆలోచన చేసి ఓటు వేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు.కాంగ్రెస్‌ అభ్యర్థి నజీర్‌ ప్రసంగిస్తూ ప్రాంతీయ పార్టీల ద్వారా అభివృధ్ది జరగదని విభజనహామీలు అమలు కావాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీకి మద్దతివ్వాలని కోరారు. కార్యక్రమంలో ఆమ్‌ఆద్మి తరపున పోటీలో ఉన్న దస్తగిరి ప్రసంగించారు. కార్యక్రమంలో పార్టీ అభిమానులు, మహిళలు పాల్గొన్నారు

➡️