మరోమారు నామినేషన్లు దాఖలు

మాచర్ల: మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్బంగా మాచర్ల నియోజక వర్గ అసెంబ్లీకి పోటి చేస్తున్న ఇండియా  వేదిక బలపర్చిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి డాక్టరు యరమల రామచంద్రారెడ్డి సోమ వారం నామినేషన్‌ దాఖలు చేశారు. సోమవారం ఉదయం తహశీల్ధార్‌ కార్యా లయంలోని ఆర్‌ఓ కార్యాలయానికి నామి నేషన్‌ వేసేందుకు చేరుకున్నారు. రామ చంద్రారెడ్డి , భార్య క్రిష్ణవేణి, కుమారుడు, సీనియర్‌ నాయకులతో కలిసి రిటర్నింగ్‌ అధికారి, పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌కు నామినేషన్‌ పత్రాలను అంద జేశారు. అనంతరం రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ మాచర్ల నియోజక వర్గంలో అభివృద్ధి కాంగ్రెస్‌ హయాం లోనే జరిగినట్లు వివరించారు. తమ కూటమి ఇచ్చిన 9 గ్యారెంటీలతో అభివృద్ధి, సం క్షమం వేగవంతంగా జరుగుతాయన్నారు. రామచంద్రారెడ్డి భార్య క్రిష్ణవేణి కూడా మారో మారు కాం గ్రెస్‌ తరపున నామి నేషన్‌ దాఖలు చేశారు. పిన్నెల్లి నామినేషన్‌.. మాచర్ల నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తన స్వగృహం నుండి కుటుంబ సమేతంగా స్వగ్రామం లోని, టౌన్‌లోని పలు దేవా లయాలను సందర్శించారు. అనంతరం ఆర్‌ఓ కార్యాలయానికి నామినేషన్‌ వేసేం దుకు చేరుకున్నారు. ఆయన సోదరి జవ్వాజి నాగ మణి, ఎం.శ్రీనివాసశర్మ, మారం వెంకటేశ్వరరావు(లడ్డు), సీనియర్‌ న్యాయ వాది నాగిరెడ్డిలతో కలిసి రిటర్నింగ్‌ అధికారి శ్యామ్‌ప్రసాద్‌కు నామినేషన్‌ పత్రాలను ఆయన అందజేశారు. అనం తరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో పేద ప్రజల కోసం పని చేసిన ప్రభు త్వం వైసిపి ప్రభుత్వమని వివరించారు. పేదల సంక్షేమం కోసం తమను గెలిపించాలన్నారు. మరో మారు తాము గెలిస్తే అన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని చెప్పారు. భారీ ర్యాలీ జనసేన, బిజెపి, తెలుగుదేశం పార్టీలు ఏకమై ఎన్ని కుయుక్తులు పన్నినా ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విజయాన్ని అపలేరని, వచ్చేది వైసిపి ప్రభుత్వమని నర్సరాపుపేట వైసిపి పార్టీ పార్లమెంట్‌ అభ్యర్ధి అనిల్‌కుమార్‌ అన్నారు. ముఖ్య నాయకులతో కలిసి పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి తన నామినేషన్‌ పత్రాలను ఆర్‌ఓ శ్యామ్‌ప్రసాదుకు అందజేశారు. అనంతరం మండాది రహదారిలోని ఆంజనేయు స్వామి దేవాలయం నుండి అభిమానుల కోలాహలం మధ్య పట్టణ పురవీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా అంబేద్కర్‌ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా హాజరైన అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ రామక్రిష్ణారెడ్డికి మాచర్ల నియోజకవర్గం కంచుకోట అని అన్నారు. అన్ని సమ యాలలో మీకు అందుబాటులో ఉండే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిని, తనను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మరో ముఖ్యఅతిథి బైరెడ్డి సిద్దార్దరెడ్డి మాట్లా డుతూ చంద్రబాబు ముఖ్య మంత్రిగా ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు.

➡️