అగ్నిప్రమాదం – రెండు పాన్‌ షాపులు దగ్ధం

Apr 1,2024 09:42 #burnt, #Fire Accident, #pawn shops, #two

విజయనగరం : అగ్నిప్రమాదం జరిగి రెండు పాన్‌ షాపులు పూర్తిగా దగ్ధమైన ఘటన ఆదివారం అర్థరాత్రి విజయనగరంలో జరిగింది. నిన్న అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మెరకముడిదాం మండలం గార్భాముక్రొత్తవీధిలో రెండు పాన్‌ షాపుల్లో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సుమారు పదిహేను లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లి ఉండవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. షాపులో దగ్ధమవ్వడంతో చిరువ్యాపారులు రోడ్డునపడ్డారు. తమను ఆదుకోవాలని ప్రజాప్రతినిధులను, అధికారులను చిరువ్యాపారుల కుటుంబీకులు వేడుకుంటున్నారు.

➡️