ఒకే ఈత లో నాలుగు మేకలు పుట్టాయి…!

Feb 27,2024 10:21 #born, #four, #goats

ప్రజాశక్తి-బుచ్చయ్యపేట (అనకాపల్లి జిల్లా) : బుచ్చయ్యపేట గ్రామ శివారు నేతవానిపాలెం గ్రామంలో ఓ మేక నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన బర్నికానచిన్న కు చెందిన మేక సోమవారం రాత్రి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. గంట సమయంలో ఒక పిల్ల మరో గంట సమయం తర్వాత మరొక పిల్లకు జన్మనిచ్చింది. సాధారణంగా మేకలు ఒకటి లేదా రెండు పిల్లలకు జన్మనిస్తూ ఉంటాయి. అరుదుగా మూడు పిల్లలకు జన్మనిచ్చిన మేకలు కూడా ఉన్నాయి. కానీ ఒకే ఈత లో నాలుగు మేక పుట్టడం అరుదుగా ఉంటుందని తెలిపారు. దీంతో గ్రామస్తులు వింతగా చూస్తున్నారు. నాలుగు మేకపిల్లలు ఆడపిల్లలే కావడం విశేషం. తల్లి మేక పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు రైతు బర్ని కాన చిన్న తెలిపారు

➡️