పియంపి అసోసియేషన్‌వారి ఉచిత బీఎండీ పరీక్షలు

Mar 4,2024 13:13 #BMD tests, #free, #PMP Association

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : స్ధానిక సాయి తేజశ్వని ఆర్థో అండ్‌ న్యూరో ఫిజియోథెరపీ సెంటర్‌ వద్ద పియంపి అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత బీఎండీ పరీక్షలను సోమవారం నిర్వహించారు. ఈ పరీక్షలలో ఎముకల సాంద్రత తెలుసుకుని ఎముకల బలమునకు కావలసిన కాల్షియం మాత్రలను ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వై.మహేష్‌ మాట్లాడుతూ … 40 సంవత్సరాలు దాటిన స్త్రీలు, పురుషులు కాల్షియం మాత్రలను డాక్టర్‌ సలహామేరకు వాడుతూ బలమైన ఆహారం, పండ్లు తీసుకోవాలన్నారు. డా.బల్లా తేజస్వని ఫిజియోధెరపి పేషెంట్లకు నొప్పులకు తగిన ఎక్సర్‌ సైజులు తెలిపారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కోన సత్యనారాయణ మాట్లాడుతూ … ప్రతి ఒక్కరూ ఇలాంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ అసోసియేషన్‌ సభ్యులు మారిశెట్టి సత్యనారాయణ, మండల కోశాదికారి వానపల్లి కనకరాజు, ఎమ్‌ చంద్రశేఖర్‌, తోరం రాము, పియంపిలు పాల్గొన్నారు.

➡️