పాడి పశువులకు ఉచిత పశు వైద్య శిబిరం

Dec 8,2023 15:45 #East Godavari
free medical camp for animals

గొంతువాపు టీకాలు కార్యక్రమం
ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లు గ్రామంలో పశువైద్యశాల వద్ద శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మిచాంగ్ తుఫాను సహాయార్థం పాడి పశువులకు ఉచిత పశు వైద్య శిబిరం మరియు గొంతువాపు టీకాలు కార్యక్రమం నిర్వహించినట్లు డాక్టర్ ముఖేష్ తెలిపారు. ఈ పశు వైద్య శిబిరం ను సర్పంచ్ ఉన్నమట్ల మనశ్శాంతి వైస్ ఎంపీపీ జజ్జవరప రామచంద్రరావు చేతుల మీదుగా ప్రారంభించారు. గొంతు వాపు టీకాలు కార్యక్రమంను ఎంపీటీసీ సానబోయిన.అర్జునరావు సిహెచ్ దుర్గ మల్లేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమానికి కొవ్వూరు డివిజన్ ఉప సంచాలకులు డా. జి.రాధాకృష్ణ హాజరై పాడిరైతులకు పశుసంవర్ధక శాఖ వివిధ పథకాలను వివరించారు. పశువైద్య శిబిరంలో పాల్గొన్న 45 మంది పాడి రైతులకు ఉచితంగా ఖనిజ లవణ మిశ్రమాలను, లివర్ టానిక్ లు ఇవ్వడం జరిగినది. సుమారుగా 15 ఆవులు, 58 గేదెలు కు వివిధ వ్యాధులకు చికిత్సలు ,గర్భకోశ వ్యాధి చికిత్సలు=18, నట్టల నివారణ మందులు=142,గొంతు వాపు వ్యాధి టీకాలు=47 ఇవ్వడం జరిగింది. పశు వైద్యాధికారులు డా.యు.ముఖేష్, డా.ఎస్.సుజిత, వెటరినరీ అసిస్టెంట్ కె.రాజశేఖర్  సహాయకులు:
విజయలక్ష్మి, కరిష్మా, శ్రీమన్నారాయణ, నాగేశ్వరరావు, అంబేద్కర్, గౌతమ్ కుమార్ పాల్గొన్నారు.

➡️