జిజిహెచ్‌లో సదుపాయాలు మరిన్ని పెంపు

Jul 1,2024 00:12

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో మౌలిక వసతుల పెంపుదలకు కృషి చేస్తున్నట్టు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వై.కిరణ్‌ కుమార్‌ తెలిపారు. రోగులకు, ఉద్యో గులు, వైద్యులకు వసతుల కల్పనకూ ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. వార్డులతో పాటు ఓపీ సేవల్లో కూడా సీనియర్‌ వైద్యులను అందుబాటులో ఉంచుతున్నామని ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
గతేడాది కాలంలో కల్పించిన మౌలిక వసతులు?
అత్యవసర చికిత్స కోసం వచ్చే వారికి అందుబాటులో ఐసియూ యూనిట్‌ ఏర్పాటు చేశాం. బ్లడ్‌ బ్యాంకు, ఆపరేషన్‌ థియేటర్లను రోగులకు, వారి అటెండెంట్‌లకు చేరువగా తీసుకువచ్చాం. ఓపీ స్లీప్‌ కోసం ఎక్కువసేపు నిలబడకుండా, తొక్కిసలాటకు అవకాశం లేకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశాం. రోగుల సహాయకులు కష్టాలు పడుతున్న సందర్భాలు చూసి వారికి వసతి కల్పించాం. పేషెంట్లు ఎక్కువ మంది వస్తుందటంతో 4వ మందుల కౌంటర్‌ను ప్రారంభించాం. ట్రాన్సజెండర్స్‌ కోసం ప్రత్యేక ఓపీని ప్రారంభించాం. జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో స్ట్రెచర్‌పై రోగులు ఉండటాన్ని గమనించి 50 పడకలను అందుబాటులో తెచ్చాం.
నిత్యం ఆస్పత్రికి ఓపీ కోసం ఎంత మంది వస్తారు?
ఓపీ కేంద్రాల వద్ద రోజుకు సగటున రెండు వేల నుంచి మూడు వేలకు వస్తున్నారు. దాంతో ఓపీ వద్ద తాకిడి పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరో10 ఓపీ కేంద్రాలను అందుబా టులోకి తెచ్చాం. ఓపీలో పని వేళలను మార్పులు చేశాం. ఉదయం 8 గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు ఓపీ నమోదు కేంద్రాలను పని చేస్తాయి.
ఓపీ కేసులు ఏ వార్డులో ఎక్కువ వస్తున్నాయి?
గుండె జబ్బు, న్యూరాలజీ ఓపీకి వస్తున్న రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే వారి కోసం ప్రత్యేక ఓపీని ఏర్పాటు చేశాం. సీనియర్‌ వైద్యులను సైతం ఓపీలో ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఆయా వార్డుల్లో పరీక్షలన్నీ ఒకేచోట చేసేలా చర్యలు చేపట్టాం.
ఆస్పత్రిలో చేపట్టిన నిర్మాణాలు? సదుపాయాలు?
జిజిహెచ్‌లో రూ.3 కోట్లతో అడ్వాన్సుడ్‌ ఐసియు యూనిట్‌ నెలకొల్పాం. రూ.5 కోట్లలో వివిధ నిర్మాణాలు చేపట్టాం. ప్రసూతి, స్త్రీ వ్యాధుల చికిత్స విభాగాన్ని రూ.70 లక్షలతో ఆధునికరించాం. పాత ఓపీ విభాగం వద్ద రూ.20 లక్షలతో రేకుల షెడ్డు నిర్మించాం. కార్డియో ధోరాసిక్‌ ఆపరేషన్‌ థియేటర్‌ను రూ.60 లక్షలతో ఆధునికరించార. మానసిక వైద్య విభాగానికి రూ.10 లక్షలతో ఎలక్ట్రో కాన్వాల్సిన్‌ థెరపి పరికరం అందుబాటులోకి తెచ్చార. నాట్కో సహాయంతో నెఫ్రాలజీ వార్డుకు 10 పడకల డయాలాసిస్‌ యూనిట్‌ను ప్రారంభించాం. చర్మ విభాగానికి రూ.కోటితో ఆధునిక పరికరం అందుబాటులోకి తెచ్చాం. కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీల కోసం రూ.20 లక్షలతో పరికరాన్ని కొనుగోలు చేశాం. రూ.80 కోట్లతో మాత శిశువు సంరక్షణ కేంద్రం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గ్యాస్ట్రో వార్డు అభివృద్ధి పనులు?గ్యాస్ట్రో ఏంట్రాలజీ విభాగానికి 30 పడకాలు ఏర్పాటు చేశారు. మూడ్రోజులపాటు గ్యాస్ట్రో ఏంట్రాలజీ ఓపీ ఉండేవిధంగా చర్యలు తీసుకున్నాం. ప్రత్యేకంగా సర్జికల్‌ గ్యాస్ట్రో ఏంట్రాలజీ వార్డు కేటాయించి 10 పడకలను ఏర్పాటు చేశారు. అసంపూర్తిగా నిలిచిన సర్వీస్‌ బ్లాక్‌ను పున:ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాం. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆధునిక సిటి స్కాన్‌ను ఏర్పాటు చేసి త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నార.
గుండె ఆపరేషన్లు కొనసాగుతున్నాయా?
పద్మశ్రీ గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో గుండె ఆపరేషన్లు, కిడ్నీ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయి. ఆయన రాకపోయినా సీనియర్‌ వైద్యులు వీటిని కొనసాగిస్తున్నారు. గుండె జబ్బులు, న్యూరాలజీ ఓపీలను ప్రతిరోజూ రోగులకు అందుబాటులో ఉంచుతున్నాం. న్యూరో సర్జరీ వార్డును ఆధునికరించి 20 పడకలను అందుబాటులో ఉంచాం.
ఆపరేషన్‌ థియేటర్ల సంఖ్యనుపెంచారా?
ఆపరేషన్‌ థియేటర్లను ఆధునికరించార. ఆపరేషన్‌ థియేటర్‌ లేక ఇబ్బందులు పడుతున్న గ్యాస్ట్రో ఏంట్రాలజీ విభాగానికి మూడో ఆపరేషన్‌ థియేటర్‌ను కేటాయించారు. క్యాజువాలిటీలో అత్యవసర రోగులకు గతంలో ఉన్న మైనర్‌ థియేటర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చాం. వీటితో మరో రెండు థియేటర్లను ప్రారంభించాం. ఆధునిక పరికరాలు అందుబాటులో తీసుకొచ్చార. అత్యవసర విభాగంలో 24 గంటల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. షిఫ్ట్‌ల వారీగా ఆర్‌ఎంఒల నియామాకం, గ్రేడ్‌-2 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లను 24 గంటలు ఉండేలా ఏర్పాటు చేశాం.

➡️