గాంధీ సేవలు అభినందనీయం : మేరుగ

ప్రజాశక్తి-చీమకుర్తి : రిజిస్ట్రేషన్‌ మరియు స్టాంపులశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా 38 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని ఉద్యోగ విరమణ చేసిన తెల్లమేకల గాంధీ సేవలు అభినందనీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగునాగార్జున తెలిపారు. స్థానిక జె అండ్‌ ఎం ఫంక్షన్‌హాలులో తెల్లమేకల గాంధీ ఉదోగ్య విరమణ ఆత్మీయ సభ జడ్‌పిటిసి వేమా శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండి పోతాయని తెలిపారు. జెవివి జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ బి. జవహర్‌ మాట్లాడుతూ గాంధీ సౌముడనీ, అతని సేవలు అభినందనీయమన్నారు. ఉద్యోగ బాధ్యతలు చేస్తూనే ,సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయ మన్నారు.అనంతరం తెల్లమేక గాంధీ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి యద్దనపూడి శ్రీనివాసరావు, ఒంగోలు గెలాక్సీ అధినేత చలువాది బదరినారాయణ, మున్సిపల్‌ ఛైర్మన్‌ గోపురపు రాజ్యలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ బాపతు వెంకటరెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్లు ఆముదాపల్లి ప్రమీలారామబ్రహ్మం, తప్పెట బాబూరావు, సోమాశేషాద్రి, సోమా శేషాద్రి,పత్తి కోటేశ్వరరావు, మేకల సులోచనా యల్లయ్య, వైసిపి పట్టణ అధ్యక్షుడు కె. శేఖరరెడ్డి, ఓబులరెడ్డి, టిడిపి నాయకులు మన్నం ప్రసాదు, మన్నం వెంకయ్య, కందిమళ్ల గంగాధరరావు, గొల్లపూడి కోటేశ్వరరావు, పూనాటి వెంకటరావు, బీసీ సంఘాల నాయకులు ఖాదర్‌బాషా, అశోక్‌, పేరం శ్రీను, శ్రావణి వెంకటేశ్వర్లు, సోమరాజు కోటేశ్వరరావు శర్మ పాల్గొన్నారు.

➡️