చిన్నకోరాడ గ్రామ ప్రజలకు తాగునీరివ్వండి : సిపిఎం డిమాండ్‌

చిన్నకోరాడ (విశాఖ) : చిన్నకోరాడ గ్రామ ప్రజల తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. మంగళవారం చిన్న కోరాడ గ్రామం పర్యటనలో భాగంగా … సిపిఎం మండల కార్యదర్శి బిటి.దొర మాట్లాడుతూ … చిన్నకోరాడలో సుమారు 30 కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. చింతలపూడి పంచాయతీలో గత వారం రోజుల నుంచి నీటి సమస్య తీవ్రంగా వేధిస్తుందన్నారు. అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారుల స్పందించి పరిష్కారం చేయాలని అక్కడ ఉండే గిరిజనులు కోరారు. బోరు నీరు తాగడం వల్ల విష జ్వరాల బారిన పడే అవకాశం ఉందని అన్నారు. సుమారు కిలోమీటర్‌ దూరం నుంచి నీరు మోస్తుకొస్తున్నామని గ్రామస్తులు వాపోయారు. తమ సమస్య వెంటనే పరిష్కరించి మంచినీరు అందించాలని కోరారు. లేదంటే ఖాళీ బిందెలతో ఎంపీడీఓ ఆఫీస్‌ కు వచ్చి నిరసన కార్యక్రమం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇరట ఈశ్వరరావు, మూల గుమ్మి ఎర్రి నాయుడు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

➡️